Home Arithmetic and Reasoning మెంటల్ ఎబిలిటీ లాజికల్ వెన్ చిత్రాలు

మెంటల్ ఎబిలిటీ లాజికల్ వెన్ చిత్రాలు

మెంటల్ ఎబిలిటీ లాజికల్ వెన్ చిత్రాలు
స్త్రీలు, పురుషులు, మనుషులు కు సరైన వెన్ చిత్రం ఏమిటి?
అన్ని పదాలు ఒకే రకానికి చెందినవి. కాని మనుషులలో స్త్రీలు, పురుషులు అనే వారు ఉంటారు.
మనుషులు గ్రూప్, మనుషులలో స్త్రీలు, పురుషులు సబ్ గ్రూపుగా ఉండేలా వెన్ చిత్రం ఉండాలి.
Logikal venchitralu competitive exams Preparaction
Logikal venchitralu competitive exams Preparaction

కుర్చీ, పుస్తకం, పెన్నులకు సరైన వెన్ చిత్రం ఏమిటి?

కుర్చీ, పుస్తకం, పెన్ను అనేవి వేరు వేరుగా ఉన్నాయి. ఒక దానికి ఒకటి సంబంధం లేదు, ఒకే గ్రూపు కాదు.
కావున వెన్ చిత్రంలో అన్నీ ఒక దానికొకటి సంబంధం లేనట్టుగా ఉండాలి.

పుస్తకం, పేజీలు, కుర్చీలకి సరైన వెన్ చిత్రం ఏమిటి?

పుస్తకం, పేజీలు ఒకే రకానికి చెందినవి. పుస్తకంలో పేజీలు ఉంటాయి. కుర్చీ వేరే రకం, విడిగా ఉంటుంది.
కావున పుస్తకంలో పేజీలు ఉండేలా, కుర్చీలు వేరేగా ఉండేలా వెన్ చిత్రం ఉండాలి.
వెన్ చిత్రం –
1) భారత దేశం, తెలంగాణ, హైదరాబాద్ లకి సరైన వెన్ చిత్రం ఏమిటి?
అన్నీ ఒకే రకానికి చెందినవి. భారత దేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం, తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం.
కావున భారత దేశంలో తెలంగాణ, తెలంగాణలో హైదరాబాద్ వచ్చేలా వెన్ చిత్రం ఉండాలి.
2) పశ్చిమబెంగాల్, కలకత్తా, అస్సాంలకు సంబందించిన వెన్ చిత్రం ఏమిటి?
పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా, అస్సాం వేరే రాష్ట్రం. కావున పశ్చిమబెంగాల్, కలకత్తా ఒక గ్రూపు, అస్సాం వేరే గ్రూపు.
పశ్చిమబెంగాల్ లో కలకత్తా ఒక భాగము. కావున పశ్చిమబెంగాల్ లో కలకత్తా ఉండి, అస్సాం వేరేగా ఉండేలా వెన్ చిత్రం ఉండాలి.
3) విశ్వం, భూమి, చంద్రుడు లకు సంబందించిన వెన్ చిత్రం ఏమిటి?
విశ్వం లో భూమి, చంద్రుడు అంతర్భాగము. కావున విశ్వం ఒక గ్రూపు, దానిలో భూమి, చంద్రుడు సబ్ గ్రూపు , ఇలా వెన్ చిత్రం ఉండాలి
4) ఉత్తరప్రదేశ్, లక్నో, తమిళనాడు లకు సంబందించిన వెన్ చిత్రం ఏమిటి?
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ లో లక్నో రావాలి. తమిళనాడు వేరే రాష్ట్రం, తమిళనాడు వేరేగా వచ్చేలా వెన్ చిత్రం ఉండాలి.
5) పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లులులకు సంబందించిన వెన్ చిత్రం ఏమిటి?
కుక్కలు, పిల్లులులు పెంపుడు జంతువులకు చెందినవి. కావున పెంపుడు జంతువులులో కుక్కలు, పిల్లులులు వచ్చేలా వెన్ చిత్రం ఉండాలి.
6) పురుషులు, లాయర్లు, డాక్టర్లుకు సంబందించిన వెన్ చిత్రం ఏమిటి?
పురుషులులలో కొంతమంది లాయర్లు, డాక్టర్లు ఉండొచ్చు, కాని పురుషులు అందరు కూడా లాయర్లు, డాక్టర్లు అని నిబంధన లేదు. ఈ విధంగా పురుషులులలో లాయర్లు, డాక్టర్లు ఉండేలా వెన్ చిత్రం ఉండాలి.
7) స్త్రీలు, ఉపాధ్యాయులు, ఇళ్ళుకు సంబందించిన వెన్ చిత్రం ఏమిటి?
స్త్రీలు, ఉపాధ్యాయులు ఒకే గ్రూపు. స్త్రీలలో కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు, ఇళ్ళు వేరే గ్రూపుకు చెందినది.
ఇలా స్త్రీలలో ఉపాధ్యాయులు ఉండి, ఇళ్ళుని వేరేగా సూచించేలా వెన్ చిత్రం ఉండాలి.

 




3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here