Home Arithmetic and Reasoning సీక్వెన్స్‌స్ అండ్ సిరిస్

సీక్వెన్స్‌స్ అండ్ సిరిస్

సీక్వెన్స్ అండ్ సిరీస్ లో చాలా రకాల మాదిరి ప్రశ్నలు ఉంటాయి. అవి

1. స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస క్రమంలో కలుపుట.

how to prepare sequence and number series
how to prepare sequence and number series

Ex: 2 6 10 14 18 22 __
ఇచ్చిన వరుస క్రమంలో ప్రతీ సంఖ్యకు 4 కలుపబడటం వలన తరువాతి సంఖ్యలు వస్తున్నాయి.
2+4=6, 6+4=10, 10+4=14, 14+4=18, 18+4=22
కావున చివరి సంఖ్యకు కూడా 4 కలపాలి.
22+4=26

2.స్థిర సంఖ్యను ఇచ్చిన వరుస సంఖ్యల నుండి తీసివేయుట.
Ex: 52 48 44 40 36 __
ఇచ్చిన వరుస క్రమంలో ప్రతీ సంఖ్యకు 4 తీసివేయబడటం వలన తరువాతి సంఖ్యలు వస్తున్నాయి.
52-4=48, 48-4=44, 44-4=40, 40-4=36
కావున చివరి సంఖ్యనుంచి కూడా 4 తీసివేయాలి.
36-4=32

3.ఒక స్థిర సంఖ్యచే గుణించగా వచ్ఛు సంఖ్య.
Ex:1. 3 15 75 375 1875 __
ఇచ్చిన వరుస క్రమంలో ప్రతీ సంఖ్య 5 చే గుణించబడటం వలన తరువాతి సంఖ్యలు వస్తున్నాయి.
3×5=15, 15×5=75, 75×5=375, 375×5=1875
కావున తరువాత వచ్చే సంఖ్య
1875*5=9375
Ex 2:- 3 12 48 192 __
ఇక్కడ ప్రతీ సంఖ్య 4 చే గుణించబడటం వలన తరువాతి సంఖ్యలు వస్తున్నాయి.
3×4=12, 12×4=48, 48×4=192,
కావున తరువాత వచ్చే సంఖ్య
192×4=768
4.వరుస క్రమంలో సంఖ్యలను కలుపుట.
Ex: 4 6 10 16 24 __
4+2=6, 6+4=10, 10+6=16, 16+8=24
ఇచ్చిన వరుస క్రమంలోని సంఖ్యలకు 2,4,6,8 అనే సరి సంఖ్యలను వరుసగా కలిపారు.
కావున 2, 4, 6, 8 తరువాత వచ్చే సరి సంఖ్య 10 ను కలిపితే తరువాతి సంఖ్య వస్తుంది.
24+10=34
5.వరుస క్రమంలో సంఖ్యలను తీసివేయుట.
Ex: 100 95 85 70 50 __
100-5=95, 95-10=85, 85-15=70, 70-20=50
ఇచ్చిన వరుస క్రమంలోని 100, 95, 85, 70, 50 సంఖ్యల నుంచి 5, 10, 15, 20 అనే సంఖ్యలను వరుసగా తీసివేసారు.
5, 10, 15, 20 వరుస క్రమంలో తరువాత వచ్చే సంఖ్య 25.
కావున చివరి సంఖ్య 50 నుంచి 25 ను తీసివేస్తే కావలసిన సంఖ్య వస్తుంది.
50-25=25
6.ఒక క్రమ పద్దతిలో సంఖ్యను గుణించుట.
Ex: 4 4 8 24 96 __
1×4=4, 2×4=8, 3×8=24, 4×24=96
ఇచ్చిన వరుస క్రమంలోని సంఖ్యలకు 1, 2, 3 ,4 సంఖ్యలు ఒక క్రమ పద్దతిలో గుణింపబడ్డాయి.
1, 2, 3 ,4 సంఖ్యల తరువాత వచ్చే సంఖ్య 5, కావున తరువాత వచ్చే సంఖ్య
5×96=480
7.ఇచ్చిన సంఖ్యల వర్గములుగా పెరుగుట.
Ex: 16 25 36 49 64 __
4×4=16, 5×5=25, 6×6=36, 7×7=49, 8×8=64
ఇచ్చిన వరుస క్రమంలోని సంఖ్యలు 4, 5, 6, 7, 8 సంఖ్యలకు వర్గాలు.
కావున తరువాత వచ్చే సంఖ్య 9×9=81
8.ఇచ్చిన సంఖ్యలు ఒక వరుసక్రమంలో సంఖ్యల ఘనములుగా పెరుగుట.
Ex: 1 8 27 64 125 __
1x1x1=1, 2x2x2=8, 3x3x3=27, 4x4x4=64, 5x5x5=125
ఇచ్చిన వరుస క్రమంలోని సంఖ్యలు 1, 2, 3, 4, 5 సంఖ్యలకు ఘనములు.
కావున తరువాత వచ్చే సంఖ్య 6x6x6=216

 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here