అమర్ రాజా బ్యాటరీస్ లో ఉద్యోగాల భర్తీకి APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల నిర్వహణ :
10వ తరగతి పాస్, ఇంటర్ పాస్ / ఫెయిల్, ఐటీఐ పాస్ /ఫెయిల్ విద్యా అర్హతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రముఖ అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 100 ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చిత్తూరు జిల్లాలో బంగారు పాళ్యం లో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. 10th Qualification Jobs 2021
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | ఏప్రిల్ 6, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | ఏప్రిల్ 8, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
NAC బిల్డింగ్, కదిరి – జమ్మలమడుగు హై వే, పులివెందుల-516390.
విభాగాల వారీగా ఖాళీలు :
మెషిన్ ఆపరేటర్స్ | 100 |
అర్హతలు :
10వ తరగతి పాస్, ఇంటర్ పాస్ /ఫెయిల్, ఐటీఐ పాస్ /ఫెయిల్ అర్హతలు గా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,500 రూపాయలు జీతం + ఈఎస్ఐ +బస్ ఫెసిలిటీ + భోజన, వసతి రాయితీలు మొదలైనవి లభిస్తాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
93983 48760
1800-425-2422