ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఓ శుభవార్త.

చాలా కాలం నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల విడుదల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఆశలు చిగురించేలా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నేడు ఒక ప్రకటన చేశారు. 

AP Govt 6500 Police Jobs Update New 2020
AP Govt 6500 Police Jobs Update New 2020

రాబోయే నెల డిసెంబర్ 2020 లో సుమారు 6500 పోలీస్ ఉద్యోగాలను నోటిఫై చేసి జనవరి 2021 లో  నోటిఫికేషన్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. 

వివరాలలోకి వెళితే, నేడు పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు విజయవాడ లో బహిరంగ సభ లో పాల్గొన్నారు. 

ఈ సభలో ప్రజల సంక్షేమంలో పోలీసులు పాత్ర మరువలేనిది అని,  అతిత్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్నా

సుమారు 6500 పోలీస్ పోస్టులు ను నాలుగు దశలలో భర్తీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన జారీచేశారు.

ఈ ఖాళీగా ఉన్నా 6500 పోలీస్ పోస్టుల ఉద్యోగాల భర్తీ కు పోస్టులను డిసెంబర్ లో నోటిఫై చేసి, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను జనవరి -2021 లో విడుదల చేయాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు పోస్టులతో పాటు, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నా వివిధ పోస్టుల భర్తీకి, అనగా ఏపీ డీఎస్సీ, ఏపీ గ్రూప్స్ నోటిఫికెషన్స్ కు సంబంధించిన అన్ని నోటిఫికెషన్స్ విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2021 లో జాబ్స్ క్యాలెండరు ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చేసిన ఈ ప్రకటన తో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్ధులు తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా తెలుగు రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన  సమాచారం కోసం telugucompetitive.com ను ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ గ్రూపు లో కూడా జాయిన్ అవ్వండి.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here