ఆంధ్రప్రదేశ్ లో మోగనున్న బడి గంటలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడి గంటలు మ్రోగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల పునః ప్రారంభం పై స్పష్టమైన ప్రకటన జారీ చేయబడినది. AP Schools Re-Open Date

దీనితో కరోనా వైరస్ లాక్ డౌన్  కారణంగా దాదాపుగా 8 నెలల నుండి మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

AP Schools Re-Open Date
AP Schools Re-Open Date

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభ తేదీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక స్పష్టమైన ప్రకటనను చేశారు.

నవంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బడులు తెరుచుకోనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపినది.

దీనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2వ తారీఖు నుండి బడిగంటలు మ్రోగనున్నట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ సారి కరోనా వైరస్ తీవ్రత ఇంకా రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తరగతుల వారీగా రెండు రోజులకు ఒకసారి జరిగేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.

దీనిలో భాగంగా 1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు పాఠశాలలను నిర్వహిస్తే, తర్వాతి రోజు 2, 4, 6, 8 తరగతులకు పాఠశాలలను నిర్వహించనున్నారు.

పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య 750 మంది పైబడితే విద్యార్థుల సంఖ్య ఆధారంగా తరగతులను నిర్వహించనున్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో ఒక వేళ పిల్లలను పాఠశాలలుకు పంపడానికి తల్లీ తండ్రులు ఆసక్తి చూపకపోతే

అటువంటి  విద్యార్థులకు ఇంటి వద్దనే ఆన్లైన్ క్లాస్ ల ద్వారా పాఠాలును చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమాలోచనలు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా  6 నెలలుగా  మూతబడిన బడి తలుపులు తెరుచుకోనున్నాయి. విద్యార్థిని విద్యార్థులు బడి గడప దాటనున్నారు.

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here