86 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మెన్ ) పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనవచ్చినది.
86 జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ -II ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ (APCPDCL) తాజాగా విడుదల చేసినది.
వ్రాత పరీక్షల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. APCPDCL Recruitment
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రంలో గల విలేజ్ మరియు వార్డ్ సెక్రటరియేట్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేది | ఏప్రిల్ 7, 2021 |
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | మే 3 , 2021 |
అప్లికేషన్స్ కరెక్షన్స్ కు చివరి తేది | మే 10-14, 2021 |
కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది | మే 18-22, 2021 |
పరీక్ష నిర్వహణ తేది | మే 23, 2021 |
పరీక్ష నిర్వహణ సమయం | 11AM to 1PM |
ప్రిలిమినరీ కీ విడుదల తేది | మే 23, 2021 |
ప్రిలిమ్స్ కీ అబ్జెక్షన్స్ కు చివరి తేది | మే 24-26, 2021 |
పరీక్ష ఫలితాల విడుదల తేది | మే 31, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఎనర్జీ అసిస్టెంట్స్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ -II) – 86
ప్రాంతముల వారీగా ఖాళీలు :
విజయవాడ – 38
గుంటూరు – 13
CRDA – 3
ఒంగోలు – 32
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతిని పూర్తి చేసి, ఎలక్ట్రికల్ ట్రేడ్ /వైర్ మెన్ ట్రేడ్స్ లలో ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
EDAR/EWC/EW&SEA విభాగాలలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చేసిన వారు మరియు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ /బోర్డు నుండి ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు 5సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఓసి / బీసీ అభ్యర్థులు 700 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులు 350 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
పరీక్ష మరియు మెరిట్ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతముగా నెలకు 15,000 రూపాయలు లభించనున్నాయి.