నూతన నోటిఫికెషన్స్ విడుదలపై ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన :
ఏపీ లోని నిరుద్యోగ అభ్యర్థులకు పండుగ చేసుకునే శుభవార్త వచ్చింది.అతీత్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలు కానుంది.
చాలా కాలం నుండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటనలకు సంబంధించిన ఏపీపీఎస్సీ ఉద్యోగాల వార్షిక క్యాలెండరు (జాబ్స్ క్యాలెండరు ) విడుదల పై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC ) నుండి అధికారిక ప్రకటన విడుదల అయినది. APPSC Recruitment Review Meeting 2021 Update
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి
సంబంధించిన జాబ్స్ క్యాలెండరు విడుదలపై జనవరి 20, 2021 తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రివ్యూ మీటింగ్ జరిగినది.
ఈ మీటింగ్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలు వ్రాసే అభ్యర్థుల వయసుకు సంబంధించి వయోపరిమితి ని 47 సంవత్సరాలకు పెంచడం,
వీలైనంత త్వరలో ఏపీపీఎస్సీ జాబ్స్ క్యాలెండరు విడుదల చేయడంపై ప్రధానంగా కమిషన్ సభ్యులు చర్చించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ -2 మరియు గ్రూప్ -3 పరీక్షలకు నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేయడం,
పరీక్షల్లో అనుసరిస్తున్న నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని రద్దు చేయడం మరియు గత 15 సంవత్సరాలు గా భర్తీ కాకుండా మిగిలి ఉన్న గ్రంధాలయ ఉద్యోగాలు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్స్ విడుదల చేయడంపై సర్వీస్ కమిషన్ సభ్యులు ప్రధానంగా చర్చించడం జరిగింది.
ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థుల క్వాలిఫయింగ్ మార్కులు తగ్గింపు, జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలు మరియు ఏపీపీఎస్సీ నిర్వహించబోయే నియామక వ్రాత పరీక్షలకు సంబంధించిన రిఫరెన్స్
పుస్తకాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచే విషయాలపై కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు చర్చించడం జరిగింది.
ఈ రివ్యూ మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అతి త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రంధాలయ శాఖ ఉద్యోగాలు,
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మొదలైన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వార్షిక క్యాలెండరు (జాబ్స్ క్యాలెండరు ) విడుదల కానున్నట్లు తెలుస్తుంది.
Job notification updates please upload
I am very happy to heard about APPSC NOTIFICATION especially junior lectures and degree college leturers
good comment thankyou