511 ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నోటిఫికేషన్ విడుదల :

IDBI బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతుంది దాని లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

భారత కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీస్ కేటగిరీకు చెందిన   వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 511 ఉద్యోగాల భర్తీకి సంబందించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

BOB Recruitment 2021
BOB Recruitment 2021

మెరిట్ మరియు ఇంటర్వ్యూల ప్రాతిపదికన భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ లో ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ లలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. BOB Recruitment 2021

ఈ పోస్టులకు ఎంపికైన ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు ఏపీ లో ఉన్న విశాఖపట్నం నగరంలో మరియు తెలంగాణ లో ఉన్న హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కలదని ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిఏప్రిల్ 9, 2021
దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 29, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్407
ఈ -వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్50
టెరిటరీ హెడ్44
గ్రూప్ హెడ్ (ఇన్వెస్ట్మెంట్ & రీసెర్చ్ )6
ప్రొడక్టివ్ హెడ్ (ఇన్వెస్ట్మెంట్ & రీసెర్చ్ )1
హెడ్ (ఆపరేషన్స్ & టెక్నాలజీ )1
డిజిటల్ సేల్స్ మేనేజర్1
ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్1

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 511 పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి సంబంధిత విభాగాలలో డిగ్రీ / పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం ఉండాలి అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

విద్యా అర్హతల గురించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలుకు మించరాదు.

ఎస్సీ /ఎస్టీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు పైన వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 600 రూపాయలు మరియు అన్ని కేటగిరీ లకు చెందిన మహిళా అభ్యర్థులు /ఎస్సీ /ఎస్టీ కేటగిరి లకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు 35,000 రూపాయలు నుండి 80,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.

IDBI bank Job Notification

Website 1

Website 2 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here   
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here