CCMB హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు :

కేవలం ఇంటర్మీడియట్ విద్యా అర్హతలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన CCMB నుండి తాజాగా విడుదల అయినది.

CCMB Assistant Jobs 2021
CCMB Assistant Jobs 2021

సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మొలెక్యూలర్ బయాలజీ (CCMB), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది. CCMB Assistant Jobs 2021

పరీక్ష మరియు టైపింగ్ టెస్టుల నిర్వహణ ద్వారా భర్తీ చేయబోయే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం తేదిఏప్రిల్  5 , 2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిమే  5 , 2021
హార్డ్ కాపీ చేరుటకు చివరి తేదిమే 17, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ (జనరల్ )4
జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ( F & A )1
జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ( S & P )1

అర్హతలు :

10+2 (ఇంటర్మీడియట్ ) విద్యా అర్హతలు గా కలిగి ఉండి కంప్యూటర్ టైపింగ్  స్పీడ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిమిషానికి 35 ఇంగ్లీష్ పదములు లేదా నిమిషానికి 30 హిందీ పదములు కంప్యూటర్ లో టైపు చేయగలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

MS వర్డ్, MS ఆఫీస్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ తదితర కంప్యూటర్ కోర్సులలో అనుభవం ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకుని, అప్లికేషన్ ఫోరమ్ కు విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలను జతపరిచి సంబంధిత అడ్రస్ లకు పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు మరియు అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు టైపింగ్ టెస్ట్ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా 30,263 రూపాయలు లభిస్తుంది.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

Recruitment Section, CSIR-Center for Cellular and Molecular Biology, Uppal Road, Habsiguda,Hyderabad – 500007,Telangana.

Website 

Notification

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here