హైదరాబాద్ CSIR లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్:

హైదరాబాద్ లో CSIR ఆధ్వర్యంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోగలరు.

Hyderabad CSIR Jobs Recruitment 2020
Hyderabad CSIR Jobs Recruitment 2020

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 

దరఖాస్తు ప్రారంభం తేదీఅక్టోబర్ 19, 2020
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 1, 2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల ఖాళీల  భర్తీ కేటగిరిల వారీగా ఈ క్రింది విధంగా ఉంది.

ప్రాజెక్ట్ అసిస్టెంట్3
ప్రాజెక్ట్ అసోసియేట్ – II1
ప్రాజెక్ట్ అసోసియేట్ -I24

విభాగాల వారీగా ఉద్యోగాల ఖాళీలు – వివరాలు :

1).కెమికల్ మరియు ఫీజికల్ సైన్స్ విభాగం:

ప్రాజెక్ట్ అసోసియేట్ (I)5
ప్రాజెక్ట్ అసోసియేట్ (II)4

2).బయాలజీ, బయో కెమికల్ మరియు బయో టెక్నాలజీ విభాగం :

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్1
ప్రాజెక్ట్ అసోసియేట్   ( I )5
ప్రాజెక్ట్ అసోసియేట్   (II)2

3).కెమికల్ ఇంజనీరింగ్ విభాగం :

ప్రాజెక్ట్ అసోసియేట్ ( I )8
ప్రాజెక్ట్ అసోసియేట్ ( II )1
ప్రాజెక్ట్ అసిస్టెంట్2

అర్హతలు :

ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయబోయే వివిధ కేటగిరి లలో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయాలంటే బీ. ఎస్సీ / డిప్లొమో /బీ. టెక్ /ఎం. టెక్ /ఎంఎస్సీ, పీ. హెచ్ డీ, ఉత్తీర్ణత అయ్యి ఉండవలెను.సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరచబడినది. వివరాలకు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ ను చూడగలరు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఆన్ లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

వయోపరిమితి :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించరాదు.

జీత భత్యాలు – వివరాలు :

ఆయా కేటగిరీ ల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 35, 000 రూపాయలు ఆ పైన HRA తో కలిపి 50, 000 రూపాయల దాకా స్టైఫండ్ అందుతుంది అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here