భారతీయ రైల్వే పరీక్షలకు మరో 30 రోజుల్లో మొదలుకానున్నాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా ఆన్లైన్ లో నిర్వహించనున్నారు. ఈ తరుణంలో తాజాగా  జరుగుతున్న వర్తమాన అంశాలు (కరెంటు అఫైర్స్ ) పైన అభ్యర్థులు దృష్టి వహించాల్సిన అవసరం ఉంది.

Latest Current Affairs For RRB Exams 2020
Latest Current Affairs For RRB Exams 2020

ఈ సందర్భంగా తాజా వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్ ) లో భాగంగా  అంతర్జాతీయ, జాతీయ, క్రీడా, సైన్స్ & టెక్నాలజీ మొదలైన అంశాలను అన్నిటిని మోడల్ బిట్స్ రూపంలో మీకు అందిస్తున్నాం.

మోడల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ 2020:

1). సెంట్రల్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతీయుల సగటు ఆయుః ప్రమాణం ఎన్ని సంవత్సరాలు గా ఉంది?

A). 59.40 సంవత్సరాలు

B). 64.50 సంవత్సరాలు

C). 65.60 సంవత్సరాలు

D). 69.40 సంవత్సరాలు

సమాధానం : A ( 69.40 సంవత్సరాలు ).

2).ఇటీవల జరిగిన న్యూజీలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ నుంచి విజయం సాధించి   న్యూజీలాండ్ ప్రధానిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టినవారు ఎవరు?

A). సురోన్ బాయి

B). అంగ్ సాన్ సూకీ

C). మెకంజీ స్కాట్

D). జేసిండా ఆర్డెర్న్

సమాధానం : D  ( జేసిండా ఆర్డెర్న్ ).

3). ఈ క్రింది ఏ భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుని 151వ జయంతి సందర్భంగా డర్బన్ లోని ఫీనిక్స్ సెటిల్ మెంట్ ను జాతీయ వారసత్వ ప్రదేశంగా దక్షిణాఫ్రికా ప్రకటించింది?

A). సుభాష్ చంద్రబోస్

B). భగత్ సింగ్

C). మహాత్మా గాంధీ

D). సర్దార్ వల్లభాయ్ పటేల్

సమాధానం : C ( మహాత్మా గాంధీ ).

4). రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశ్యం గా రైల్వే భద్రతా దళం (RPF) అందుబాటులోనికి తీసుకు వచ్చిన నూతన కార్యక్రమం పేరు?

A). మేరీ సహేలి

B). మేరీ మాత

C). మేరీ బహీన్

D).మేరీ సోదరి

సమాధానం : A ( మేరీ సహేలి ).

5). ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఆహార, వ్యవసాయ సంస్థ ( ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజషన్ – FAO ) 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ని రూపాయల స్మారక నాణెమును భారతదేశ ప్రధాని విడుదల చేసారు?

A). 20 రూపాయలు

B). 75 రూపాయలు

C).100 రూపాయలు

D).125 రూపాయలు

సమాధానం : B ( 75 రూపాయలు ).

6). భారతదేశంలో  మొట్టమొదటి  హర్ ఘర్ జల్ రాష్ట్రంగా నిలిచినది?

A). ఆంధ్రప్రదేశ్

B). తమిళనాడు

C). గోవా

D). మధ్యప్రదేశ్

సమాధానం : C ( గోవా ).

7). ప్రపంచ ఆకలి సూచి -2020 భారతదేశ స్థానం?

A). 75వ స్థానం

B).94వ స్థానం

C).95వ స్థానం

D).96వ స్థానం

సమాధానం : B ( 94వ స్థానం ).

8). భారత వైమానిక దళం (IAF)లో చేరిన అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళ పైలెట్ గా ఈ క్రింది వారిలో ఎవరు రికార్డు సృష్టించనున్నారు?

A). శివాంగి సింగ్

B). సీమా ముస్తఫా

C). ఖుషీ చిందాలీయ

D). భాను అథియా

సమాధానం : A ( శివాంగి సింగ్ ).

9). 75 సంవత్సరాల ఐక్యరాజ్య సమితి చరిత్రలో సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాలును  తొలిసారిగా వర్చ్యువల్ విధానంలో ఈ క్రింది ఏ తేదీలలో నిర్వహించారు?

A). సెప్టెంబర్ 22-25

B).సెప్టెంబర్ 22-26

C).సెప్టెంబర్ 22-28

D). సెప్టెంబర్ 22-29

సమాధానం :  D  ( సెప్టెంబర్ 22-29 ).

10). ఈ క్రింది వారిలో  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) నూతన చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించినవారు?

A). రాకేష్ ఆస్తానా

B).ప్రదీప్ కుమార్ జోషి

C). భాను ప్రకాష్

D). మనోజ్ సిన్హా

సమాధానం : B ( ప్రదీప్ కుమార్ జోషి ).

11). భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్ బీ ఐ ) చైర్మన్ గా నూతనంగా నియమితులైనవారు?

A). సురేష్ చంద్ర శర్మ

B). రాజ్ కిరణ్ రాయ్

C). దినేష్ కుమార్ ఖరా

D). శేఖర్ బసు

సమాధానం : C ( దినేష్ కుమార్ ఖారా ).

12). శత్రుదేశాల రాడార్లను ధ్వంసం చేసే కొత్తరకం యాంటీ రేడియేషన్ క్షిపణి ని భారత్ ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. అయితే భారత్ ప్రయోగించిన ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి పేరు?

A). రుద్రం -1

B). రుద్రం -2

C). రుద్రం -3

D). రుద్రం -4

సమాధానం : A ( రుద్రం -1)

13). చందమామ పై 4G సెల్యులార్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన మొబైల్ నెట్ వర్క్ సంస్థ?

A). శాంసంగ్

B). నోకియా

C). రియల్ మీ

D). ఆపిల్

సమాధానం : B ( నోకియా ).

14).భారతదేశంలో తొలి కిసాన్ రైలు ఆగష్టు 7వ తేదీ 2020 సంవత్సరంలో  ఏ రాష్ట్రాల మధ్య ప్రారంభించారు?

A). మహారాష్ట్ర – బీహార్

B). మహారాష్ట్ర – ఒరిస్సా

C). మహారాష్ట్ర – బీహార్

D). మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్

సమాధానం :A ( మహారాష్ట్ర – బీహార్ ).

15). భారతదేశంలో తొలి కార్గో రైలును ఏ రైల్వే జోన్ ద్వారా ఆగష్టు 5,2020 న ప్రారంభించారు?

A). తూర్పు రైల్వే

B). దక్షిణ రైల్వే

C). దక్షిణ మధ్య రైల్వే

D). ఉత్తర రైల్వే

సమాధానం : C ( దక్షిణ మధ్య రైల్వే ).

 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here