Home Group 1 Let us learn About Diseases Caused By Protozoans | ప్రొటోజువాల వలన కలిగే...

Let us learn About Diseases Caused By Protozoans | ప్రొటోజువాల వలన కలిగే వ్యాధులు గురించి తెలుసుకుందాం

ప్రొటోజువాల వలన కలిగే వ్యాధులు :

మలేరియా :

  • ఈ వ్యాధి ప్లాస్మోడియం అనే వ్యాధి కారకం వలన కలగడం జరుగుతుంది.
  • వ్యాధి గ్రస్తమైన ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు వలన మనిషి కి మలేరియా వ్యాధి అనేది కలుగుతుంది.
  • దీనిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ అయిన చలి దశ లో తలనొప్పి, వణుకు పెరుగుదల వంటివి కలుగుతాయి.
  • రెండవ దశ అయిన జ్వరం దశ లో ఉష్ణోగ్రత పెరుగుదల, తీవ్ర తలనొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పి, వాంతులు వంటివి కలుగుతాయి.
  • మూడవ దశ అయిన చెమట దశ లో చెమట పోయడం, ఉష్ణోగ్రత తగ్గుదల, భాద వంటివి కలుగుతాయి.

[Sassy_Social_Share]

అమీబియాసిస్ :

  • ఈ వ్యాధి ఎంటమిబా హిస్టోలైటికా అనే ప్రోటోజువా వలన కలగడం జరుగుతుంది.
  • ఇది పెద్దప్రేగు లో సంక్రమించడం జరుగుతుంది.
  • మలంతో కలుషితమైన ఆహారం, మంచి నీరు, కూరగాయలు వంటి మొదలైన వాటి ద్వారా లేదా కోశాల అంతర్గహనం ద్వారా మనిషి నుండి మనిషి కి ఇవి సంక్రమిస్తూ ఉంటాయి.
  • దీని వలన తీవ్రమైన రక్త విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, కాలేయం, మెదడు, ప్లేహంలో పుండ్లు ఏర్పడటం వంటివి జరుగుతాయి.
Let us learn About Diseases Caused By Protozoans
Let us learn About Diseases Caused By Protozoans

అతినిద్రాజాడ్యం :

  • ఈ వ్యాధి ట్రెపినోజోమా గ్రాంబియాన్సి అనే ప్రోటోజువా వలన కలగడం జరుగుతుంది.
  • ఇది మానవుని రక్తం మరియు మశ్కిష్ట మేరు ద్రవంలో ఉంటుంది.
  • ఈ వ్యాధి సీసీ ఈగ కాటు ద్వారా సంక్రమించడం జరుగుతుంది.
  • దీని వలన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్నులోని మెడ మీద గ్రంధులతో వాపు, వెన్ను మీద ఛాతి మీద గుళ్ళలు ఏర్పడటం, కీళ్ళ నొప్పులు, కను రెప్పలు వాయడం, ఆకలి మందగించడం, నిద్రపోవాలనే తప్ప పనేమి చేయాలనిపించకపోవడం వంటివి కలుగడం జరుగుతుంది.

ఓరియంటల్ సోర్స్ :

  • ఈ వ్యాధి లెస్మానియా ప్రోకికా అనే ప్రోటోజువా వలన కలగడం జరుగుతుంది.
  • ఇవి రెటిక్యులో ఇండోదిలియల్ కణాలలో ఆవాసం ఏర్పరుచుకొని అంటువ్యాధి సోకిన సాండ్ ఈగ కాటు ద్వారా మనిషి కి సంక్రమించడం జరుగుతుంది.
  • ఈ సాండ్ ఈగ కాటు వేసిన చోటుల్లో పుండ్లు పడటం జరుగుతుంది.
  • సాధారణంగా ముఖం, కాళ్ళు, చేతులు మీద పుండ్ల రావడం ఈ వ్యాధి యొక్క లక్షణాలు గా పేర్కనడం జరిగింది.

కాలా అజార్ :

  • ఈ వ్యాధి లెస్మానియా దోనో వాని అనే జీవి వలన కలగడం జరుగుతుంది.
  • ఇవి కూడ రెటిక్యులో ఇండోదిలియల్ కణాలలో ఆవాసం ఏర్పరుచుకొని అంటువ్యాధి సోకిన సాండ్ ఈగ కాటు ద్వారా మనిషి కి సంక్రమించడం జరుగుతుంది.
  • ప్లేహం, కాలేయమ్ వాపు, జ్వరం, కామెర్లు, చర్మం నల్లబడటం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు గా పేర్కనడం జరిగింది.

అతిసారం :

  • ఈ వ్యాధి జియార్డియా ఇత్తేస్టి నాలిస్ అనే జీవి వలన కలగడం జరుగుతుంది.
  • ఇది అంతర్మూలం, వైజననం పై భాగంలో ఆవాసం ఏర్పరుచుకొంటుంది.
  • మల మూత్రాలు కలుషితమైన ఆహారం, మంచినీరు తీసుకోవడం వలన మనకు ఈ వ్యాధి కలగుతుంది.
  • కొవ్వు శోషణ సరిగా లేకపోవడం, అధికమైన కొవ్వుతో పసుపు పచ్చ రంగులో గల జిగట విరోచనాలు అవడం అనేవి ఈ వ్యాధి యొక్క లక్షణాలు గా పేర్కనడం జరిగింది.

 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here