Home Group 1 Let’s learn about the nervous system | నాఢీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం

Let’s learn about the nervous system | నాఢీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం

నాఢీ వ్యవస్థ :

  • మనకు స్పర్శ ని తెలపడంలో గల ప్రధానమైనది గా నాఢీ వ్యవస్థ ని చెప్తారు.
  • ఈ నాఢీ వ్యవస్థ లేకపోతే మనిషికి స్పర్శ అనేదే ఉండదు అని చెప్పవచ్చు.
  • ఈ నాఢీ వ్యవస్థ అనేది శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రాహకాలు అనే అటువంటి కణాల ద్వారా గ్రహించడం జరుగుతుంది.
  • నాఢీ మండలంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అవి, Let’s learn about the nervous system
  1. మెదడు
  2. వెన్నుపాము
  3. నాడులు

[Sassy_Social_Share]

Let's learn about the nervous system
Let’s learn about the nervous system

 

  • అదేవిదంగా ఈ నాఢీ మండలంలో 2 రకాల కణాలు  ఉంటాయి. వాటిని
  1. నాఢీ కణాలు
  2. గ్లియల్ కణాలు గా చెప్తారు.
  • ఈ గ్లియల్ కణాలు అనేవి నాఢీ కణాల కు పోషణను ఇస్తాయి.
  • అదేవిదంగా నాఢీ కణాలు క్రియాత్మక పరిణామాలు మరియు వార్తలను గ్రహించి విశ్లేశిస్తాయి అని చెప్తారు.
  • ఇక్కడ ఈ నాఢీ కణాలను ముఖ్యమైనవి గా పేర్కొనవచ్చు.

నాఢీ కణం దాని నిర్మాణం :

  • ఈ నాఢీ కణాల యొక్క నిర్మాణం, ప్రచోదనాలు అనేవి ఒక నాఢీ కణం నుండి మరోక నాఢీ కణానికి ఏ విధంగా వెలుతాయో వంటివి చూసినట్లయితే,
  • నాఢీ కణం లో కణదేహం అనేది ఉంటుంది. దీనినే నాఢీ కణదేహం గా కూడ పిలుస్తారు.
  • ఈ నాఢీ కణదేహం లోని మద్య భాగాన్ని కేంద్రకం గా పిలవడం జరుగుతుంది.
  • నాఢీ కణదేహాని కి కణికలు లాగ కనిపించే భాగాలను నిస్సాన్ కణికలు అని పిలవడం జరుగుతుంది.
  • ఈ నాఢీ కణదేహాని కి ఉండే డెండ్రైట్స్ అనేవి ఉంటయి.
  •  డెండ్రైట్స్ అనేవి వేరే నాఢీ కణాల తో కలవడం జరుగుతుంది.
  • నాఢీ కణం లో పొడవుగా ఉండే భాగాన్ని ఏక్సాన్ అని చెప్పడం జరుగుతుంది.
  • ఈ ఏక్సాన్ చుట్టూ ఉండే తొడుగు లాంటి భాగాన్ని మైలిన్ తొడుగుగా పేర్కొనడం అనేది జరిగింది.
  • మైలిన్ తొడుగు లో అక్కడక్కడ గణుతులు లాగా ఖాళీ ప్రదేశాలు గా ఉండే భాగాలను రన్ వీర్ కణుపులు గా పేర్కొనడం అనేది జరిగింది.
  • ఈ నాఢీ కణం లోని చివరలో క్రింద ఉండే భాగాన్ని నాఢీ అంత్యములు గా చెప్పడం జరుగుతుంది.
  • పైన చెప్పిన విదంగా నాఢీ కణం యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవచ్చు.
  • ఈ నాఢీ కణాల ద్వారానే శరీరంలో జరిగే రక రకాల మార్పుల గురించి, స్పర్శ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది.

నాడులు :

  • ఈ నాఢీ వ్యవస్థ లోని నాడుల గురించి చూసినట్లయితే,
  • మెదడు లేక వెన్నుపాము నుండి నిర్వాహక అంగాలకు ప్రచోదనాలను తీసుకువెళ్ళే నాడుల ను చాలక నాడులు లేదా అపవాహిక నాడులు అని అంటారు.
  • అంటే కాళ్ళు, చేతులు వంటి నిర్వాహక అంగాలకు ప్రచోదనాలను తీసుకువెళ్ళే నాడులను చాలక నాడులు లేదా అపవాహిక నాడులు గా పేర్కొంటారు.
  • కాళ్ళు, చేతులు అనేవి చాలక నాడుల చర్య వలన కదులుతాయి.
  • జ్ణానేంద్రియాల నుండి వార్తలను మెదడు లేదా వెన్నుపాము కు తీసుకొనివెచ్చే నాడులను జ్ణాన నాడులు లేదా అభివాహిక నాడులు అని అంటారు.

 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here