జనవరి 22 న అమలాపురం లో మెగా జాబ్ మేళా :

సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైస్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SIDAP) మరియు  జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ,

యువకులకు వివిధ ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలు కల్పించేందుకు గాను జనవరి 22 వ తేదీన మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నారు.

Mega Job Mela 2021 Update Telugu
Mega Job Mela 2021 Update Telugu

 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ  అర్హతలుతో కూడిన ఉద్యోగాలను ఈ జాబ్ మేళా లో కల్పించనున్నారు. ఈ ఉద్యోగాల జాబ్ మేళాకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును.

ముఖ్యమైన తేదీలు :

జాబ్ మేళా నిర్వహణ తేదిజనవరి 22, 2021
జాబ్ మేళా  నిర్వహణ సమయం09:00 AM
జాబ్ మేళా నిర్వహణ ప్రదేశంTTDC ట్రైనింగ్ సెంటర్,బాలయోగి ఘాట్ అమలాపురం ,తూర్పుగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్.

సంస్థల వారీగా ఉద్యోగాలు :

SBI లైఫ్ ఇన్సూరెన్స్ :

ఈ సంస్థలో లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్ మేనేజర్ మరియు లైఫ్ మిత్ర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్ మేనేజర్ ఉద్యోగాలకు డిగ్రీ మరియు లైఫ్ మిత్ర ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతలు కలిగిన 26 -30 సంవత్సరాలు వయసు గల స్త్రీ /పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులుకు 15,000 రూపాయలు  వరకూ జీతం మరియు ఇన్సెంటివ్ లు  అందనున్నాయి . కాకినాడ, అమలాపురం లో వృత్తి బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది.

అమర్ రాజ బ్యాటరీస్ లిమిటెడ్  :

ఈ సంస్థలో ఆపరేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

10వ తరగతి/ఇంటర్మీడియట్/ఐటీఐ అర్హతలు కలిగిన 18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,000 రూపాయలు జీతం మరియు ఇన్సెంటివ్ లు లభించనున్నాయి . చిత్తూరు లో వృత్తి బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

ఇన్నోవా సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ :

ఈ సంస్థలో బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ మరియు రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ బ్యాంకు సేల్స్ అనుభవం కలిగి ఉండాలి. మరియు రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఆపై సేల్స్, టెలి కాలింగ్ తదితర రంగాలలో అనుభవం ఉన్న 18 నుండి 28 సంవత్సరాలు గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 13,000 రూపాయలు నుండి 20,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్ లు లభించనున్నాయి.తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వృత్తి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.

స్పెన్సర్ రిటైల్ స్టోర్స్ :

ఈ సంస్థలో కస్టమర్ సేల్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

10వ తరగతి అర్హత కలిగి  18 నుండి 28 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 8000 రూపాయలు నుండి 10,000 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.రాజమండ్రి లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

సంప్రదించవలసిన మొబైల్  నంబర్ :

9989910835

9963957281

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here