టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ )వ్రాసే అభ్యర్థులకు శుభవార్త:

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) వ్రాయబోయే అభ్యర్థులకు  NCTE   శుభవార్తను అందించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) సర్టిఫికెట్ కు లైఫ్ టైం వాలిడిటీ లభించనుంది. 

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) తీసుకున్న ఈ తాజా నిర్ణయం ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్న లక్షలాదిమంది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ ఊరట లభించి లబ్ధి పొందనున్నారు.

ఇప్పటివరకూ NCTE మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ )టెట్  పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కు 7 సంవత్సరాల వాలిడిటీ మాత్రమే ఉంది. NCTE New Guide Lines For TET Exam

NCTE New Guide Lines For TET Exam
NCTE New Guide Lines For TET Exam

కాగా తాజాగా ఈ టెట్ వాలిడిటీ ను జీవితకాలం ఉపయోగించుకునే విధంగా NCTE  తమ తాజా ఉత్తర్వులను జారీ చేసింది.

రాష్ట్రాలలో నిర్వహించే టెట్ తో పాటు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికెట్ కు కూడా జీవితకాలపు (లైఫ్ టైమ్ వాలిడిటీ ) లభించనున్నట్లు తెలుస్తుంది.

కొత్తగా టెట్ రాయబోయే టీచర్ ట్రైనింగ్ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించనున్నదని, ఇది వరకూ టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు విషయంలో న్యాయసమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని NCTE ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు కు AP DSC పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఇటీవలే డీఎస్సీ కు ముందుగా టెట్ పరీక్ష నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు ప్రకటించిన నేపథ్యంలో..

తాజాగా  NCTE టెట్ పరీక్షకు సంబంధించి  జారీ చేసిన  ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు వరం అని చెప్పవచ్చును.

NCTE తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలో కోట్లాదిమంది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు లబ్ధి చేకూరనుంది.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here