NMDC, హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన ప్రముఖ నగరం హైదరాబాద్ లో ఉన్న నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NMDC) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ – ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గాల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు .
మరియు ఈ ఒప్పంద ప్రాతిపదిక పద్దతిలో భర్తీ కాబోయే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. NMDC Recruitment 210 Jobs
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | ఏప్రిల్ 15, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఎగ్జిక్యూటివ్ పోస్టులు | 97 |
నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టులు | 113 |
ఎగ్జిక్యూటివ్ పోస్టులు :
ఎనర్జీ మేనేజ్ మెంట్ డిపార్టుమెంటు | 39 |
సేఫ్టీ | 21 |
మెటీరియల్స్ మేనేజ్ మెంట్ | 16 |
కాంట్రాక్టు మేనేజ్ మెంట్ | 11 |
కంట్రోలైస్డ్ మెయింటైనెన్స్ మెకానికల్ | 4 |
కంప్రెస్సెడ్ ఎయిర్ స్టేషన్ | 2 |
క్రేన్ ఇంజనీరింగ్ | 4 |
నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టులు :
ఎనర్జీ మేనేజ్ మెంట్ డిపార్టుమెంటు | 87 |
హాట్ స్ట్రిప్ మిల్ | 6 |
కంట్రోల్ మెయింటనెన్స్ మెకానికల్ | 5 |
కంప్రెస్సెడ్ ఎయిర్ స్టేషన్ | 8 |
క్రేన్ ఇంజనీరింగ్ | 7 |
అర్హతలు :
పోస్టులను అనుసరించి 10వ తరగతి , సంబంధిత ట్రేడ్స్ లలో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా మరియు సంబంధిత విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
65 సంవత్సరాలు లోపు వయసు కలవారు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
విభాగాలను అనుసరించి రాత పరీక్ష , ఇంటర్వ్యూ, మరియు సూపర్ వైజరీ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూపాయలు నుండి 1,50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.