NTPC లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ :
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ( NTPC ) లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ఈ ఉద్యోగాలను వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.
ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ లో భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. NTPC Recruitment 2021
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | ఏప్రిల్ 1, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | ఏప్రిల్ 15, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఎగ్జిక్యూటివ్ (సేఫ్టీ ) | 25 |
ఎగ్జిక్యూటివ్( ఐటీ డేటా సెంటర్ /డేటా రికవరీ ) | 8 |
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ( సోలార్ ) | 1 |
స్పెషలిస్ట్ ( సోలార్ ) | 1 |
అర్హతలు :
విభాగాలను అనుసరించి భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.కొన్ని విభాగాల పోస్టులకు ఎం. టెక్ కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు. మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 55 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ/EWS కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ/ ఎస్టీ /అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
పరీక్ష / ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 71,000 రూపాయలు పైన లభిస్తుంది.