రైల్వే పరీక్షలు -2020 కీ సంబంధించిన షెడ్యూల్ పై భారతీయ రైల్వే బోర్డు ప్రకటన :

రైల్వే బోర్డు -2020 పరీక్షలపై అభ్యర్థుల్లో నెలకొన్న అనేక సందేహాలకు సమాధానమిస్తూ తాజాగా భారతీయ రైల్వే బోర్డు ఒక ప్రకటనను జారీ చేసినది.

RRB Exams Schedule 2020 Update
RRB Exams Schedule 2020 Update

భారతీయ రైల్వే బోర్డు చేసిన తాజా ప్రకటన ద్వారా రైల్వే  పరీక్షల తేదీలపై నెలకొని వున్న అనిశ్చితికీ తెరపడింది.

రైల్వే బోర్డు చైర్మన్ తాజాగా ఈ వాయిదా పడిన పరీక్షల తేదీలపై ఫుల్ క్లారిటీ ఇస్తూ ఒక ప్రకటన జారీ చేసారు.

గరిష్ట స్థాయిలో ఈ రైల్వే పరీక్షలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కారణంగా, కోవిడ్ -19 నియమ నిబంధనల మధ్య అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య  రైల్వే బోర్డు పరీక్షలను డిసెంబర్ -15,2020 నుంచి మొదలు పెట్టి వచ్చే సంవత్సరం జూన్ -2021 వరకూ జరుపుతామని ఈ ప్రకటనలో తెలిపారు.

రైల్వే బోర్డు -2020 పరీక్షలు – షెడ్యూల్ ( అంచనా ):

రైల్వే మినిస్ట్రీస్ పరీక్షలుడిసెంబర్ 15-23, 2020
రైల్వే ఎన్టీపీసీ పరీక్షలుజనవరి – మార్చి, 2021
రైల్వే గ్రూప్ – డీ పరీక్షలుమార్చి – జూన్,   2021

భారతీయ రైల్వే బోర్డు లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి 3 విభాగాలలో నోటిఫికేషన్స్ జారీ చేసిన సంగతి మనకు విదితమే.ఆయా కేటగిరీల్లో పోస్టులకు సుమారుగా రెండు కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా,

కరోనా వైరస్ కారణంగా ఈ ఉద్యోగాల భర్తీ నిర్వహణలో భాగంగా జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.రైల్వే బోర్డు చేసిన ఈ తాజా ప్రకటన తో పరీక్షలపై అభ్యర్థుల్లో ఉన్న అనేక సందేహాలకు సమాధానం దొరికినట్లయింది.

రైల్వే బోర్డు నుంచి వచ్చిన తాజా ప్రకటన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షల తేదీలపై సందేహాలను వదిలి వెంటనే తమ తమ రైల్వే పరీక్షల ప్రేపరషన్ ను వెంటనే మొదలుపెడితే మంచి ఫలితాలను అందుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు.

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here