జనవరి 16వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్ :
భారతీయ రైల్వే ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షలు తాజాగా ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలు జనవరి 29,2021 వరకూ జరుగనున్నాయి.
జనవరి 16 వ తేది రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇస్తున్న సమాచారం మేరకు రైల్వే ఎన్టీపీసీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను సంబంధిత బిట్స్ రూపంలో సమాధానాలతో సహా రూపొందిస్తున్నాము. RRB NTPC Exams 2021 Jan 16 th Shift 1 Bits
ఈ ప్రశ్నలు రాబోయే షిఫ్ట్స్ లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోతున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి అనే ఉద్దేశ్యంతో అభ్యర్థులకు అందించడం జరుగుతుంది.
జనవరి 16 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 పరీక్షలో వచ్చిన బిట్స్ :
1). పంబన్ దీవి భారతదేశంలో ఎక్కడ ఉంది?
జవాబు : రామేశ్వరం (తమిళనాడు ).
2). భూటన్ ప్రస్తుత ప్రధాని ఎవరు?
జవాబు : లోటాయ్ టీషీరింగ్.
3). రాజస్థాన్ రాష్ట్ర క్రీడ పేరు?
జవాబు : బాస్కెట్ బాల్.
4). హంపీ లో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయం పేరు?
జవాబు : శ్రీ వీరుపాక్ష దేవాలయం.
5). చారిత్రక వండివాస్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జవాబు : జనవరి 22,1760.
6). మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రముల ఆవిర్భవం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు : మే 1,1960.
7). అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఎక్కడ ఉంది?
జవాబు : వాషింగ్టన్ డీ.సీ
8). టోక్యో అనునది ఏ దేశపు రాజధాని?
జవాబు : జపాన్.
9). ఫాతేపుర్ సిక్రి నిర్మాణాన్ని గావించిన మొఘలు చక్రవర్తి?
జవాబు : అక్బర్.
10). ఎలక్ట్రాన్ కనుగొన్నందుకు గాను జె. జె.థాంసన్ కు నోబెల్ అవార్డు లభించిన సంవత్సరం?
జవాబు : 1906.
11). జాన్ పూర్ నగరం ఏ భారత దేశ రాష్ట్రంలో కలదు?
జవాబు : ఉత్తరప్రదేశ్.
12). ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది?
జవాబు : ది హేగ్ ( నేతర్లాండ్).
13).మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్ కు తిరిగి వచ్చిన సంవత్సరం?
జవాబు : జనవరి 9,1915.
14). ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు : మౌలానా హస్రాత్ మోహని.
15). ఇస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 సంవత్సరానికి గాను భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది?
జవాబు : 63 వ స్థానం.
16). ఫాదర్ ఆఫ్ గ్రీన్ రేవల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు?
జవాబు : ఎం. ఎస్. స్వామి నాథన్.
17). చంద్రయాన్ -1 ప్రయోగాన్ని ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించింది?
జవాబు : అక్టోబర్ 22,2008.
18). జై జవాన్ – జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?
జవాబు : లాల్ బహదూర్ శాస్త్రి.
19). మలేరియా దేనివల్ల వస్తుంది?
జవాబు : ప్లాస్మోడియం.
20). వెనిగర్ కెమికల్ ఫార్ములా ఏది?
జవాబు : CH3COOH.
21).2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనసాంద్రత కలిగిన భారత దేశ రాష్ట్రం ఏది?
జవాబు : అరుణాచల్ ప్రదేశ్.
22). SONAR అనే పదాన్ని విస్తరించగా…?
జవాబు : Short for Sound Navigation and Ranging.
జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు
Railway NTPC Model Paper
మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి