మెదక్ రీజియన్ ఆర్టీసీ లో అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ :

10వ తరగతి విద్యా అర్హతలతో ఆర్టీసీ లో అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ తాజాగా తెలిపినది.

RTC Vacancies Telugu
RTC Vacancies Telugu

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ఆధ్వర్యంలో ఉన్న మెదక్ రీజియన్ ఆర్టీసీ లో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది. RTC Vacancies Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా అతి తక్కువ విద్యా అర్హతలతో, కేవలం ఇంటర్వ్యూ విధానం ద్వారా భర్తీ చేయబోయే పోస్టులకు అర్హతలు గల తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ ట్రైనింగ్ ను 6 నెలలు మరియు జాబ్ ట్రైనింగ్ ను 19 నెలలు మొత్తం 25 నెలలు ట్రైనింగ్ ను ఇవ్వనున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రం మెదక్ రీజియన్ లో అప్ప్రెంటీస్ పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

మెకానిక్ డీజిల్  (ఆటో మొబైల్ )125

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతిని పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

ఎటువంటి వయసు పరిమితిని ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

మెరిట్ లిస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 6,000 రూపాయలు నుండి 6,500 రూపాయలు వరకూ స్టైఫండ్ ను కల్పించనున్నారు.

Apply Link

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here