భారతీయ రైల్వే లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భాగంగా  రైల్వే మినిస్ట్రీస్, ఎన్టీపీసీ, గ్రూప్ -4 మొదలైన విభాగాలలో నిర్వహించే రైల్వే పరీక్షలకు సమయం ఆసన్నమవుతుంది.

రాబోయే నెల డిసెంబర్ -15 నుండి వివిధ విభాగాలలో మొదలయ్యే ఈ రైల్వే  పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులందరికీ భారతదేశంలో ఉన్న ప్రత్యేకత కల్గిన రైళ్ల గురించిన  అవగాహన అత్యవసరం. ఈ సందర్భంగా భారతదేశం లో రైళ్లు – వాటి ప్రత్యేకతలు అనే అంశంపై  సమగ్రమైన విజ్ఞానాన్ని  మీకు అందిస్తున్నాము.

Special Trains-RRB Exam Preparation
Special Trains-RRB Exam Preparation

భారతదేశంలో ముఖ్యమైన రైళ్లు – వాటి ప్రత్యేకతలు :

ఫెయిరీ క్వీన్ :

భారతదేశం లో ప్రస్తుతం ఉన్న అతి పురాతన రైలు ఇంజన్ పేరు  ఫెయిరీ క్వీన్.

దక్కన్ క్వీన్ :

భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్. ఈ దక్కన్ క్వీన్ రైలు ను పూణే – కళ్యాణ్ మధ్య 1929వ సంవత్సరంలో ప్రారంభించారు.

గతిమాన్ ఎక్స్ ప్రెస్ :

భారతదేశం లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు పేరు గతిమాన్ ఎక్స్ ప్రెస్. గతి మాన్ ఎక్స్ ప్రెస్ న్యూ ఢిల్లీ నుండి ఝాన్సీ మధ్య గంటకు 160 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.

సంఝౌతా ఎక్స్ ప్రెస్ :

పాకిస్తాన్ మరియు భారత దేశం మధ్య లాహోర్ నుండి కటారి వరకూ ప్రయాణించే రైలు పేరు సంఝౌతా ఎక్స్ ప్రెస్. ఇది భారత దేశంలో అతి తక్కువ దూరం నడుస్తుంది.

శతాబ్ధి ఎక్స్ ప్రెస్ :

శతాబ్ధి ఎక్స్ ప్రెస్ న్యూ ఢిల్లీ నుండి బోఫాల్ మధ్య గంటకు 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది.

హిమసాగర్ ఎక్స్ ప్రెస్ :

జమ్మూ తావి – కన్యాకుమారి ల మధ్య 3,726 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది.

ధన్వంతరి ఎక్స్ ప్రెస్ :

భారతదేశంలో రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు పేరు ధన్వంతరి ఎక్స్ ప్రెస్.

మైత్రి ఎక్స్ ప్రెస్ :

భారతదేశం లోని పశ్చిమ బెంగాల్ – బంగ్లాదేశ్ ల మధ్య నడపబడుతున్న రైలు పేరు మైత్రి ఎక్స్ ప్రెస్.

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here